
ఇక మనుషుల ప్రాణాలు తీసేవాళ్లను ఏమంటాం? హంతకులు అంటాం. మరి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి, యువత జేబులు గుల్ల చేసి, వాళ్లు అప్పులు పాలయ్యేలా చేసి, చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేసేవాళ్లను ఏమంటాం? వాళ్లను కూడా కిల్లర్స్ అనే అంటాం కదా! బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసి, యూత్ ఎమోషన్లతో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ భరతం పడుతున్నారు పోలీసులు. ఇన్నాళ్లు జనంతో ఆడుకున్న ఆ 11మంది ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి ఇప్పుడు…రివర్స్ గేమ్ స్టార్టయింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌లో ఎవరెవరు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారో చూద్దాం. విష్ణుప్రియ, టేస్టీ తేజ, సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, లోకల్‌బాయ్ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శ్యామల.. మొత్తం 11మందికి వీళ్లందరికి నోటీసులు జారీ చేసి, కేసు నమోదు చేశారు హైదరాబాద్, పంజాగుట్ట పోలీసులు. విష్ణుప్రియ, టేస్టీ తేజ తరపున..పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు శేఖర్ బాషా. షూటింగ్ కారణంగా పోలీస్ విచారణకు సమయం కోరారు శేఖర్ బాషా. దీంతో మూడు రోజుల తర్వాత విచారణకు రావాలని విష్ణుప్రియ, టేస్టీ తేజలను పంజాగుట్ట పోలీసులు ఆదేశించారు.
పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. సమాజాన్ని పక్కదోవ పట్టించే వీడియోలతోపాటు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ పలువురి ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణలున్నాయి. ఇక యూనిఫాంలో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశాడు కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్. బయ్యా సన్నీ యాదవ్, లోకల్‌బాయ్ నాని వంటి వారిపై ఇప్పటికే అరెస్ట్ వారంట్లూ జారీఅయ్యాయి. లోకల్ బాయ్ నాని అరెస్టవ్వగా.. బయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్‌లో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనపైనా అభియోగాలున్నాయి.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..