
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. SBI తన కస్టమర్లకు పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, FD ఖాతా, RD ఖాతా వంటి వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను అందిస్తుంది. ఎస్బీఐ అందిస్తున్న ఈ పథకంపై వినియోగదారులు మంచి రాబడిని పొందుతున్నారు. ఎస్బీఐ అమృత్ వృష్టి పథకం కింద తన కస్టమర్లకు FDపై అత్యధిక వడ్డీని ఇస్తుంది.
SBI అమృత్ వృష్టి FD అంటే ఏమిటి?
ఎస్బీఐ అమృత్ వృష్టి పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జులై 15, 2024 నుండి మార్చి 31, 2025 వరకు పరిమిత కాలానికి అందించే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం
ఇవి కూడా చదవండి
‘అమృత్ వృష్టి’ FD పథకం 444 రోజుల్లో మెచ్యూరిటీ
‘అమృత్ వృష్టి’ ఎఫ్డి పథకం కింద ఎస్బిఐ తన కస్టమర్లకు సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఎస్బిఐ మరే ఇతర ఎఫ్డి పథకంపై కస్టమర్లకు అంత వడ్డీ లభించదు. ఎస్బిఐ ‘అమృత్ వృష్టి’ ఎఫ్డి పథకం కింద మీరు రూ. 3 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఈ ఎఫ్డి పథకం 444 రోజుల్లో మెచ్యూరిటీ అవుతుంది. ఆ తర్వాత ఎఫ్డి ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు మీ పొదుపు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
ఈ పథకం మార్చి 31, 2025న ముగింపు:
ఈ పథకంలో ఒక సీనియర్ సిటిజన్ రూ. 2,00,000 డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో అతనికి మొత్తం రూ. 2,19,859 లభిస్తుంది. ఇందులో నికర, స్థిర వడ్డీ రూ. 19,859 ఉంటుంది. అంటే దాదాపు రూ.20 వేల వరకు వడ్డీ అందుకోవచ్చు. మరోవైపు ఒక సాధారణ వ్యక్తి (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) ఈ పథకంలో రూ. 2,00,000 డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో అతనికి మొత్తం రూ. 2,18,532 లభిస్తుంది. ఇందులో రూ. 18,532 స్థిర వడ్డీ కూడా ఉంటుంది. ఎస్బీఐ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే ప్రభుత్వ బ్యాంకు. అందుకే ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఎస్బీఐ ఈ ప్రత్యేక ఎఫ్డీ పథకం ‘అమృత్ వృష్టి’ మార్చి 31, 2025న గడువు ముగియనుంది. ఈ లోపు ఈ పథకంలో చేరవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి