
భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక 2025కు చెందిన అత్యంత సంపన్న మహిళల జాబితాను రూపొందించగా సావిత్రి జిందాల్ దేశంలోనే రిచెస్ట్ ఉమెన్‌గా నిలిచారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం సావిత్రి జిందాల్ ఆస్తుల విలువ సుమారు 35.5 బిలియన్ డాలర్లు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ తర్వాత సావిత్రి మూడో స్థానంలో నిలవడం విశేషం. భారతదేశపు అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎదగడానికి ఆమె ప్రయాణం సాగిన విధానం చూస్తే..
అస్సాంలోని టిన్సుకియాకు చెందిన మార్వారీ కుటుంబానికి చెందిన సావిత్రి జిందాల్ 2005లో తన భర్త అకాల మరణంతో OP జిందాల్ గ్రూప్ బాధ్యతలను తీసుకున్నారు. ఆమె నాయకత్వంలో ఆ కంపెనీ భారతదేశ ఉక్కు, విద్యుత్, సిమెంట్, మౌలిక సదుపాయాల రంగాలలో ఆధిపత్య పాత్ర పోషించింది. ఆమె అగ్రోహాలోని మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజీ అధ్యక్షురాలు కూడా విధులు నిర్వహించారు. ఆమె సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ఇచ్చింది.
జిందాల్ గ్రూప్‌ను సావిత్రి దివంగత భర్త ఓం ప్రకాష్ జిందాల్ స్థాపించారు. ఇప్పుడు దీనికి వారి నలుగురు కుమారులు నాయకత్వం వహిస్తున్నారు. ముంబైకి చెందిన సజ్జన్ జిందాల్ JSW స్టీల్, JSW సిమెంట్, JSW పెయింట్స్ వంటి వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. సావిత్రి జిందాల్ నాయకత్వంలో, MG మోటార్‌తో EV జాయింట్ వెంచర్ వంటి ప్రధాన మైలురాళ్ళు సాధించబడ్డాయి.
ఇవి కూడా చదవండి
ఎదురులేని వ్యాపారవేత్తగానే కాదు..సావిత్రి జిందాల్ హర్యానా ప్రభుత్వంలో మాజీ మంత్రి, హర్యానా విధాన సభ సభ్యురాలిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ (INC), భారతీయ జనతా పార్టీ (BJP) లతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రజా సేవలో ఆమె బహుముఖ ప్రజ్ఞ, ప్రభావాన్ని ప్రదర్శిస్తుంటారు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఫ్రాన్స్‌కు చెందిన లోరియల్ కంపెనీ యజమాని ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్. ఆమెకు రిలయన్స్ ముఖేష్ అంబానీకంటే ఎక్కువగా ఆస్తి ఉంది. బెటెన్‌కోర్ట్‌కు $ 85.9 బిలియన్ల ఆస్తులున్నాయి.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 78.8 బిలియన్ డాలర్లు. భారతదేశంతోపాటు ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ముఖేష్ అంబానీ నిలిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..