

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాగే ఎన్నో రికార్డ్ క్రియెట్ చేసింది ఈ చిన్నది.
ఇక ఓవర్సీస్ లోనూ భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా పై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మొదటి ఎనిమిది రోజులు ఇవ్వగా, ఆ తర్వాత 14 రోజుల వరకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.
అయితే ప్రభుత్వనిర్ణయాలను తప్పుబడుతూ హైకోర్టులో పీల్ వేశారు. ప్రభుత్వం మొదటి ఎనిమిది రోజులు ఇవ్వగా, ఆ తర్వాత 14 రోజుల వరకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ రవితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తాము విచారించాల్సింది ఏమీ లేదని కోర్టు పేర్కొంది. సినిమా నిర్మాణ కోసం పెట్టిన ఖర్చు పై విచారణ జరిపించలేము. ఈడీకి ఆదేశించలేము అని న్యాయస్థానం తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.