
చెన్నైకు చెందిన సంగీత 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. కెరీర్ ప్రారంభంలోనే శివ పుత్రుడు సినిమాలో చియాన్ విక్రమ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే 2002లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమా సంగీత కెరీర్ ను మలుపు తిప్పింది. ఇందులో సీతామహాలక్ష్మి అనే అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు క్రమంగా హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తాయి. శివపుత్రుడు, పెళ్లాం ఊరెళితె, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరి నీ ప్రేమ బంగారంగానూ, శివపుత్రుడు, నేను పెళ్లికి రెడీ, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, విజయేంద్ర వర్మ, ఖుషీఖుషీగా, సంక్రాంతి, నా ఊపిరి తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ మెరిసిందీ అందాల తార. అయితే తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే తమిళ సింగర్ క్రిష్ ను వివాహం చేసుకుంది. 2009లో తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరికి శివ్హియ అనే ముద్దుల కూతురు జన్మించింది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది సంగీత. తన భర్త, కూతురి ఫొటోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా శివ్హియ కూతురు ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా, అవి కాస్తా క్షణాల్లోనే వైరలయ్యాయి. ఇందులో శివ్హియ చాలా క్యూట్ గా ఉందంటుని, అందంలో అచ్చం అమ్మలాగే ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
కూతురుతో సంగీత..
ఇక సెకెండ్ ఇన్నింగ్స్ లో సరిలేరు నీకెవ్వరు, ఆచార్య, వారసుడు, మసూద తదితర హిట్ సినిమాల్లో నటించింది సంగీత. అలాగే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీవీ షోల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తోంది. ప్రస్తుతం తమిళ టీవీ షోలతో పాటు కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార.
వెకేషన్ లో సంగీత ఫ్యామిలీ.. వీడియో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.