
గతేడాది డిసెంబర్ లో అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో శోభితతో తన లైఫ్, ప్రేమ గురించి అనేక విషయాలను పంచుకున్నారు చైతూ. తాజాగా వీరిద్దరు కలిసి ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఫోటోషూట్ ఇచ్చారు. వోగ్ ఇండియా అనే మ్యాగజైన్ ముఖచిత్రం కోసం ఈ జంట ఫోటోషూట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే ఇక్కడ శోభిత ధరించిన డ్రెస్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంతకు ముందు సమంత సైతం అచ్చం ఇలాంటి మోడల్ డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేయడం గమనార్హం.
ఇక ఇప్పుడు శోభిత సైతం అలాంటి మోడల్ డ్రెస్ ధరించడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. వోగ్ మ్యగజైన్ కోసం శోభిత అఖ్ల్ బ్రాండ్ నుండి వెండి రంగు టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ ధర రూ. 49,593. ఈ స్టైలీష్ డ్రెస్ కోసం ఆమె చాలా సింపుల్ మేకప్ తో కనిపించి మరింత అందంగా కనిపించింది.
ఇదిలా ఉంటే.. అంతకు సమంత సైతం.. స్టూడియో మూన్ రే నుండి ఇటీవల ధరించిన ఓంబ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ డ్రెస్ ధరించింది. ఇక ఇప్పుడు శోభిత, సమంత ధరించిన రెండు ఒకే మాదిరిగా ఉన్నాయని.. కానీ కాస్త వేరుగా ఉన్నాయంటూ ఇద్దరు దుస్తులను పోలుస్తున్నారు నెటిజన్స్. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..