
హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా సినీరంగంలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడిప్పుడే సినిమాల్లో నటించేందుకు యాక్టివ్ అయ్యింది. అలాగే ఇప్పుడు ఆమె ఎక్కువగా వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. వీటితోపాటు సామాజిక సమస్యలపై పనిచేస్తుంది. ఇప్పుడు మహిళల తరుపున మాట్లాడుతున్నారు. తాజాగా తన పాడ్ కాస్ట్ లో మహిళల పీరియడ్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇప్పటికీ ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడాటానికి సిగ్గుపడుతున్నానని ఆమె తన నిరాశను వ్యక్తం చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన కామెట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సమంత మాట్లాడుతూ.. “మహిళలుగా మేము ఇంత దూరం వచ్చాము. అయినప్పటికీ పీరియడ్స్ విషయానికి వస్తే మేము మౌనంగా ఉండిపోతాము. మేము ఈ విషయం గురించి చిన్నగా మాట్లాడుతాము. ఎందుకంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాలంటే మేము అవమానంగా భావిస్తున్నాము. ఈ మనస్తత్వాన్ని అమ్మాయిలుగా మేము మార్చుకోవాలి. ఈ ఋతు చక్రం (Menstrual Cycle) అనేది చాలా శక్తివంతమైనది. ఇది జీవితాన్ని ధృవీకరిస్తుంది. ఇది సిగ్గుపడాల్సిన లేదా తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు.. మన మనస్సులను, శరీరాలను ఋతుచక్రం ఎలా ప్రభావితం చేస్తుందో మనం ప్రతి సంవత్సరం నేర్చుకోవడం కొనసాగించాలి ” అంటూ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే నిర్మాత సామ్ నిర్మించిన శుభం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది సామ్. ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్న రక్త బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్ డమ్ చిత్రంలో నటిస్తుంది సామ్.
ఇవి కూడా చదవండి :
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?