
బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సికందర్. డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇందులో సత్య రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం సికందర్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. ఈ వేడుకలో రష్మికతో తనకు ఉన్న ఏజ్ గ్యాప్ ట్రోలింగ్ పై స్పందించాడు సల్మాన్.
ఈ సినిమాలో జోడిగా రష్మిక నటించడంపై పలు విమర్శలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ కంటే రష్మిక 31 ఏళ్లు చిన్నది అంటూ నెట్టింట ట్రోలింగ్ జరిగింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇదే విషయంపై సల్మాన్ మాట్లాడుతూ.. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. ఆమె తండ్రికి కూడా సమస్య లేదు.. వాళ్లకే లేని సమస్య మీకు ఎందుకు ? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. రష్మికకు పెళ్లైనా కూడా ఆమెతో కలిసి నటిస్తాను.. అలాగే ఆమెకు కూతురు పుడితే తనతో కూడా సినిమాలు చేస్తాను అంటూ కౌంటరిచ్చారు సల్మాన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
అలాగే సల్మాన్ మాట్లాడుతూ.. రష్మిక అంకితభావంపై ప్రశంసలు కురిపించాడు. అటు పుష్ప 2తోపాటు ఇటు సికందర్ షూటింగ్ లోనూ ఒకేసారి పాల్గొన్నదని.. ఒకే రోజులో రెండు సినిమా చిత్రీకరణలో పాల్గొందని తెలిపారు. డే టైంలో పుష్ప 2.. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరున్నర వరకు సికందర్ చిత్రీకరణలో పాల్గొందని చెప్పుకొచ్చాడు. కాలుకు గాయమైన సరే లెక్కచేయకుండా షూటింగ్స్, ప్రమోషన్స్ చేసిందని చెప్పుకొచ్చాడు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..