
జవాన్ సినిమా వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసిన తీరు చూసి, నార్త్ హీరోలందరూ ఫిదా అయిపోయారు. అట్లీ కోసం నార్త్ స్టార్లందరూ క్యూ కట్టేస్తున్నారనే మాటలు కూడా వైరల్ అయ్యాయి.
అందులో ముఖ్యంగా సల్మాన్‌ఖాన్ కాల్షీట్ ఇచ్చేశారని, జవాన్ని మించిన సబ్జెక్టుతో రెడీ అయిపోయారన్నది వైరల్ న్యూస్. అయితే ఇప్పుడు ఈ న్యూస్‌కి బ్రేక్ వేసేశారు సల్మాన్. అట్లీతో సినిమా చేయాలని చాలా ట్రై చేసినట్టు తెలిపారు.
అయినా సాధ్యపడనట్టు డిక్లేర్ చేశారు. రీజన్ ఏంటని ఆరా తీస్తే… బడ్జెట్ ఇష్యూ అని ఓపెన్‌గానే చెప్పేశారు భాయ్. ఇప్పటికీ, ఇండియన్ టాప్ హీరోల్లో సల్మాన్‌ఖాన్ ఒకరు అని పృథ్విరాజ్ కూడా ఈ మధ్య స్టేజ్ మీద అన్నారు.
అలాంటప్పుడు..అంతటి టాప్ హీరోకి కూడా బడ్జెట్ ఇష్యూ ఉంటుందా? ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టడానికి మేకర్స్ సిద్ధంగనే ఉంటారు కదా అని చర్చ షురూ అయింది. కాకపోతే సల్మాన్‌కి కొన్నాళ్లుగా సరైన హిట్ లేదు కాబట్టి, పెట్టుబడి పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారేమోననే వెర్షన్ కూడా వినిపిస్తోంది.
సౌత్ సినిమాలతో అడపాదడపా టచ్‌లో ఉండటానికి ఇష్టపడుతుంటారు సల్మాన్. ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగదాస్‌తో సికందర్లో నటిస్తున్నారు. ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి స్టార్ హీరోకి. హిట్ పక్కా అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్లో.