
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్ర మంత్రి ఈ ఘటనపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సైఫ్‌పై దాడి జరిగిందా.? అన్న అనుమానాలు తమకు కలుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణేతో పాటు పలువురు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దాడి చేసిన బంగ్లాదేశ్ వ్యక్తి సైఫ్ అభిమాని అయివుంటాడని అన్నారు. ముందు ముంబైలో ఫుట్‌పాత్ మీద ఉండే బంగ్లాదేశీలు.. స్టార్ల ఇళ్లలోకి వస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్ సమయంలో అతడు నడిచిన తీరు చూస్తుంటే దాడి జరిగినట్టు లేదని, డాన్స్ చేసినట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పైన పేర్కొన్న వీడియోలో మీరూ చూసేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి