
సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో షరీఫుల్లాను అరెస్ట్ చేసిన పోలీసులు ..తాజాగా బెంగాల్ నడియాలో మహిళను అదుపులోకి తీసుకున్నారు తెరపైకి వస్తున్న షాకింగ్ అప్డేట్స్పై అదే రేంజ్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే..ఈ కేసు ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆయనపై ఎటాక్, తరువాత చికిత్స, డిశ్చార్జ్‌పై పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన మహ్మద్ షరీఫుల్ .. సైఫ్ అలీఖాన్ ఇంట్లో లభించిన వేలిముద్రలు, షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని తెలుస్త్తోంది. దీంతో పోలీసులు చేసిన అరెస్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి 19 వేలిముద్రల నమూనాలను స్వాధీనం చేసుకుంది. అయితే షరీఫుల్ ఇస్లాం షాజాద్ వేలిముద్రతో ఏ ఒక్క నమూనా కూడా సరిపోలడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు షరీఫుల్లాను అరెస్ట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరో పక్క ఇప్పటికే మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ తండ్రి బంగ్లాదేశ్ నుండి ఇదే విషయాన్ని ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి విడుదలైన సిసిటివి ఫుటేజీలో కనిపించే వ్యక్తి తన కుమారుడు షరీఫుల్ ఇస్లాం కాదని, ఎందుకంటే అతని శరీరాకృతి, అతని హెయిర్ స్టైల్ భిన్నంగా ఉంటాయని అన్నాడు. దానికి తోడు ఫోరెన్సిక్ బృందం తన నివేదికలో సీసీటీవీ ఫుటేజీలో కనిపించే వ్యక్తి షరీఫుల్ ఇస్లాం కాదని పేర్కొంది.
ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న వేలిముద్రతో షరీఫుల్ ఇస్లాం వేలిముద్ర సరిపోలక పోవడం ముంబై పోలీసులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఉంది. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కూడా సాగుతోంది. ఇక ఈ అంశం మీద పలువురు నెటిజన్లు ఇదేదో సినిమా కథను మించి ఉన్నట్టుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..