
దుండగుడి దాడిలో కత్తి పోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నటుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకునేందుకు మీడియా రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనిపై సైఫ్ సతీమణి కరీనా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీనా కపూర్ ప్రస్తుతం టెన్షన్లో ఉంది. ఈ పరిస్థితి రావడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్లిష్ట పరిస్థితిలో తమ కుటుంబ విషయాల్లో గోప్యత పాటించాలని కరీనా కుటుంబీకులు. అయితే కొంతమంది మాత్రం సైఫ్ కుటుంబీకుల విజ్ఞప్తిని పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల కరీనా ఓ బొమ్మను ఇంటికి తీసుకొచ్చిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఛాయాచిత్రకారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు.ఇది కరీనా దృష్టికి వచ్చింది. దీంత ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ‘ దయచేసి ఇక ఆపు తారా?. మీకు హృదయం ఉందా.. దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని వదిలేయండి’ అని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం నమస్కారం ఎమోజీని కూడా జత చేసింది. అయితే ఆ తర్వాత ఏమైందైమో కానీ కొద్ది సేపటికే ఈ పోస్ట్ డిలీట్ చేసింది.
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారులు తైమూర్ జే అలీ ఖాన్ ఇటీవల తమ తండ్రి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రికి వచ్చారు. సైఫ్‌తో పాటు సోదరి సోహా అలీ ఖాన్ కూడా వచ్చారు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఇటీవల వచ్చి తన కుమారుడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మహ్మద్ షైఫుల్లా ఇస్లాం షాజాద్ అనే వ్యక్తి సైఫ్‌పై దాడి చేశాడు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దాడికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడు. సైఫ్ అలీఖాన్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత సైఫ్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన త్వరలో సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
లీలావతి ఆస్పత్రి వద్ద కరీనా కపూర్..
Mumbai Maharashtra: Actor Kareena Kapoor Khan arrives at Lilavati Hospital pic.twitter.com/gofDA1jFev
— IANS (@ians_india) January 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.