
తెలుగులో అప్పుడెప్పుడో సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు స్క్రిప్టులను ఓకే చేయనే లేదు. ఇంతకీ సాయిపల్లవి తెలుగు సినిమాలు చేస్తారా? చేయరా? ఎందుకు దూరంగా ఉంటున్నట్టు? ఆమె నటించిన తమిళ సినిమాల డబ్బింగులే మనం చూడాలా? అసలేమైంది… ఇలాంటి ప్రశ్నలన్నీ వరుసగా దండయాత్ర చేసినప్పుడు రిలీజ్ అయింది అమరన్.
ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్.. అంటూ మహేష్ బాబు డైలాగ్‌ని మరింత మాస్‌గా చెప్పేశారు సాయిపల్లవి. అమరన్‌గా ఆమె నటన చూసి ఫిదా అయిపోయారు జనాలు. బోర్న్ యాక్ట్రెస్ అని పదే పదే మెచ్చుకున్నారు. అంతలా వారిని మెప్పించింది అమరన్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేసిన సందడి చూసిన వారందరికీ లవ్ స్టోరీ హీరో నాగచైతన్యతో ఆమె నటిస్తున్న తండేల్ గుర్తుకొచ్చేసింది.
లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్యతో ఆమె నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాలో బుజ్జితల్లిగా ఇప్పటికే ఆమె కేరక్టర్‌కి చాలా మంచి ఎలివేషన్ ఇచ్చేశారు మేకర్స్. అక్కినేని అభిమానులే కాదు, యూత్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది తండేల్ సినిమా కోసం.
ఈ ఏడాది తండేల్తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నది సాయిపల్లవి సంకల్పం. నెక్స్ట్ ఇయర్‌కి ఎలాగూ నార్త్ రామాయణం రిలీజ్ అవుతుంది. అంతలోపే బాలీవుడ్లో ఆమీర్‌ఖాన్ తనయుడి సినిమా ఉంది పల్లవి చేతిలో..
ఇవన్నీ ఒక ఎత్తు. సాయిపల్లవి ఓకే చేసిన లేడీ ఓరియంటెడ్ లవ్ స్టోరీ మరో ఎత్తు అనే మాట ఒకటి టాలీవుడ్లో స్పీడందుకుంది. ఈ మధ్య ఓ అప్‌కమింగ్ డైరక్టర్ చెప్పిన కథకు ఫిదా అయ్యారట పల్లవి. ఇప్పటిదాకా తమిళంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన పల్లవి, ఈ సినిమాలో తెలుగులోనూ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నారనే మాట వైరల్ అవుతోంది.