రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 8.7గా తీవ్రత నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్ వాతావరణ శాఖ ఈ వీషయాన్ని ప్రకటించింది. రష్యాలోని కంచెట్కా ద్వీపకల్పం దగ్గర ఈ భూకంపం సంభవించింది. హవాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ ఉత్తర భాగం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించడంతో జపాన్ అధికారులు అలర్ట్ అయ్యారు. సై
పాన్, రోటా, టినియన్, గువామ్‌తో పాటు సమీప ద్వీపాలను అప్రమత్తం చేశారు అధికారులు. అమెరికాలోని అలస్కాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భూకంపం రావడంతో ప్రాణ నష్టం జరగలేదు.
తీర ప్రాంతాల్లో భారీగా ఆలలు ఎగసిపడుతున్నాయి. 3 నుండి 4 మీటర్ల (సుమారు 10 నుండి 13 అడుగులు) వరకు పెద్ద పెద్ద అలలు విరుచుకుపడుతున్నాయి. జపాన్ వాతావరణ సంస్థ కూడా తన పసిఫిక్ తీరం వెంబడి ప్రజలను హెచ్చరించింది, 1 మీటర్ (సుమారు 3 అడుగులు) వరకు అలలు తీరానికి చేరుకోవచ్చని తెలిపింది.
Tsunami Warnings have just been issued for nearly all of the East Coast of Japan, with residents near coastal areas, rivers, or lakes in several prefectures being told to immediately evacuate to higher ground. pic.twitter.com/daXIb6mOfj
— OSINTdefender (@sentdefender) July 30, 2025
