
రుక్సార్ ధిల్లన్ ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. అలాగే కన్నడ , హిందీ సినిమాల్లో కూడా నటించింది. రుక్సార్ ధిల్లన్ 1993 అక్టోబర్ 12న లండన్‌లో జన్మించింది. ఆమె పంజాబీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె బాల్యం గోవాలో గడిచింది.
ప్రస్తుతం ఆమె కుటుంబం బెంగళూరులో సెటిల్ అయ్యింది ఈ చిన్నది. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, కానీ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. రుక్సార్ 2016లో కన్నడ సినిమా “రన్ ఆంటోనీ”తో సినీ రంగంలోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
2017లో “ఆకతాయి” సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత నాని సరసన “కృష్ణార్జున యుద్ధం” లో నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇంకా “ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ”, “అశోకవనంలో అర్జున కల్యాణం” (2022) వంటి చిత్రాల్లో నటించింది.
2020లో “భంగ్రా పా లే” అనే హిందీ చిత్రంలో కూడా కనిపించింది. రీసెంట్ గా దిల్రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రుక్సార్ ధిల్లన్ తన అందం, నటనా నైపుణ్యంతో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుంది మరియు ఇంకా అనేక ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.