
రాయల్ ఎన్ఫీల్డ్ మార్చి 27న భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్లాసిక్ 650ను విడుదల చేయనుంది. 650సీసీ క్రూయిజర్ బైకెన్ 650, సూపర్ మీటియర్ 650, ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, బేర్ 650 తర్వాత బ్రాండ్ నుంచి రిలీజ్ అయ్యే బైక్ క్లాసిక్ 650.
రాయల్ ఎన్ఫీల్డ్ గత సంవత్సరం కొత్త క్లాసిక్ 650ని ఆవిష్కరించింది. డిజైన్ పరంగా ఇది క్లాసిక్ 350లో మాదిరిగానే రెట్రో లుక్‌తో లాంచ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్‌లో 647 సీసీ, ఎయిర్/ఆయిల్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్ 46.4 హెచ్‌పీ పవర్, 52.3 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసి స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ 650 క్లాసిక్ ఇంజిన్, అండర్ పిన్నింగ్లను షాట్రన్ 650తో పంచుకుంటుంది. ఇది ఒకే ఫ్రేమ్‌తో వస్తుంది. అలాగే ఒకేలాంటి సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్ సింగిల్ 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్స్‌తో వస్తాయి. క్లాసిక్ 650 బైక్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో ఆకట్టుకుంటుంది.