
టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. అంతకంటే ముందు కూడా సరైన ఫామ్‌లో లేని రోహిత్ అదే బ్యాడ్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే.. తాజాగా తన ఫామ్ గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నిజాయితీగా చెప్పాలంటే.. నేను బంతిని సరిగా కొట్టడం లేదు. ఆ సమయంలో గిల్ ఆడతే బాగుంటుందని మేం అనుకున్నాం. అతను చాలా మంచి ఆటగాడు, అంతకంటే ముందు టెస్ట్ మ్యాచ్ గిల్ ఆడలేదు.
నేను కోచ్, సెలెక్టర్‌తో మాట్లాడాను – వారు నా నిర్ణయాన్ని అంగీకరించారు. టీమ్‌కు ఏది మంచిదో అదే చేయాలని, అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతే అలా జరిగిపోయింది.” అంటూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌కు తానకు తానుగా ఎందుకు దూరం ఉండాల్సి వచ్చిందో రోహిత్ శర్మ వివరించాడు. ఆ టైమ్‌లోనే నేను మెచ్యురిటీ ఉన్న మనిషిని, ఇద్దరు పిల్లల తండ్రి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నాకు తెలియదా అంటూ రోహిత్ శర్మ తనపై వచ్చే విమర్శలతో పాటు ఆ సిడ్నీ టెస్ట్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాడు. ఇప్పుడు తాజాగా కూడా ఆ విషయంపై స్పందించాడు. ఆ బీజీటీ టోర్నీలో టీమిండియా ఫేలవ ప్రదర్శన కనబర్చింది. విరాట్ కోహ్లీ ఆరంభంలో ఒక సెంచరీ చేసినా.. తర్వాత అతను కూడా విఫలం అయ్యాడు.
ఆ టోర్నీ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఐపీఎల్లో విరాట్ కోహ్లీ రాణిస్తుండగా.. రోహిత్ శర్మ మాత్రం అదే బ్యాడ్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. మోకాలి గాయంతో ఒక మ్యాచ్ కూడా రోహిత్ దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఇదే బ్యాడ్ ఫామ్ కొనసాగితే.. తర్వాత మ్యాచ్‌లకు రోహిత్ ఏమైనా దూరంగా ఉంటాడా అనే చర్చ కూడా మొదలైంది. మరి చూడాలి రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..