
ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత యంగ్ హీరో నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్ హుడ్. ఛలో, భీష్మ సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆసీస్ డ్యాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడంతో రాబిన్ హుడ్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. కానీ ఆడియెన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఆశించిన స్పందన రాలేదు. కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా, నితిన్ , శ్రీలీల జోడీ ఆకట్టుకున్నా కథా, కథనాలు ఆడియెన్స్ ను అలరించలేకపోయాయి. దీనికి తోడు డేవిడ్ వార్నర్ కొద్ది సేపు మాత్రమే కనిపించడం, సీక్వెల్ కోసం ఆ రోల్ ను దాచి పెట్టడం పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో రాబిన్ హుడ్ సినిమాకు ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే దక్కాయి. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన రాబిన్ హుడ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వేసవి కానుకగా మే 2 నుంచి రాబిన్ హుడ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం
ఇవి కూడా చదవండి
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన రాబిన్ హుడ్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్, షిజు, మైమ్ గోపీ, ఆడుకలం నరేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలందించారు.
ఒకేసారి ఓటీటీలోనూ, టీవీలోనూ!
#Robinhood OTT Release Date-
Strong buzz on social media suggests that Robinhood will make its digital debut on ZEE5 on May 2, 2025.
Although there’s no official confirmation from the makers or the streaming platform, pic.twitter.com/wX46ny14wE
— MOHIT_R.C (@Mohit_RC_91) April 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.