తెలుగురాష్ట్రాల్లో అత్యంత ధనవంతులైన వ్యక్తుల జాబితా చూసుకుంటే అందులో దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మురలి దివి మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన నెట్వర్త్ వచ్చేసి రూ. 76,000 కోట్లు. ఈయన జాతీయ స్థాయిలో 26వ స్థానంలో ఉన్నారు. అలాగే దివిస్ లాబొరేటరీస్ మెడిసిన్ తయారీలో ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన సంస్థగా ఉంది.
