తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించారు. పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక అతిథిగా జపాన్ బృందం హాజరైంది. ప్రజలకు అబివాదం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పోలీసులకు మెడల్స్ ఇవ్వనున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌కు వెళ్లారు. గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.
