
రేపే గణతంత్ర దినోత్సవం.. ఈ రోజు భారతదేశంలో 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటాం. ఈ పండుగ మన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, ఐక్యతను సూచిస్తుంది. ఢిల్లీలో జరిగే పౌరసభలు, పరేడ్లు ఈ రోజు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అయితే ఇంట్లోనే మనం ఈ వేడుకలను మరింత అద్భుతంగా చేసుకుంటే ఎంతో బాగుంటుందో కదా. ఇక ఈ ప్రత్యేక రోజును మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి కొన్ని సింపుల్ గ్రాండ్ డెకరేషన్స్ గురించి తెలుసుకుందాం.
త్రివర్ణ కలర్స్ తో డెకరేషన్
మీ ఇంటిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ రంగులతో అలంకరించడం ఒక గొప్ప ఆలోచన. ఆరెంజ్, వైట్, గ్రీన్ రంగులతో మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించండి. డైనింగ్ హాల్ లో కూడా త్రివర్ణ కలర్స్ తో డెకరేట్ చేయండి. కొన్ని నేచురల్ ఫుడ్స్ కూడా ఈ కలర్స్ తో ప్రిపేర్ చేయండి. దీంతో పాటు మీరు త్రివర్ణ రంగుల్లో మంచి రంగోళీలు, కాగితం పువ్వులను తయారు చేయండి. ఇంటి ప్రవేశ ద్వారంలో వీటితో అలకరించండి. దీంతో పండుగ వాతావరణం కనపడుతుంది. పిల్లలకు కూడా బాగా ఆసక్తిగా ఉంటుంది. పైగా దేశభక్తి కూడా పెరుగుతుంది.
ఇండియన్ ఫ్లాగ్ తో గౌరవంగా అలంకరణ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఫ్లాగ్ ను గౌరవంగా ప్రదర్శించడం అనేది ఎంతో ముఖ్యం. ఇంటి మధ్య భాగంలో లేదా బాల్కనీలో జెండాను పెట్టండి. మీరు జెండాతో పాటు దేశభక్తి నినాదాలను లేదా భారత జాతీయ గీతంలోని ప్రముఖ వాక్యాలను బ్యానర్లుగా రూపొందించి వాటిని జోడించవచ్చు. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో దేశభక్తి పరిమళం నిండిపోయేలా ఉంటుంది.
DIY డెకరేషన్స్
ఇంట్లో కొన్ని డై డెకరేషన్స్ వంటివి తయారు చేయడం ద్వారా మీరు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించవచ్చు. చిన్న బొమ్మలు, గణతంత్ర దినోత్సవ పరేడ్ ఫ్లోట్స్ను చిన్నపాటి రూపంలో చేయవచ్చు. మీరు క్రియేట్ చేసిన ఈ అందమైన వస్తువులు మీ ఇంటిని మరింత విశిష్టంగా మారుస్తాయి.
లైటింగ్ డెకరేషన్
ఈ రోజున ఇంటిని వెలుగులతో ప్రకాశవంతంగా అలంకరించడం చాలా ముఖ్యం. త్రివర్ణ రంగుల LED లైట్లు లేదా ఫెయిరీ లైట్లు ఇంట్లో ప్రత్యేకమైన వెలుగును తెస్తాయి. మీరు ఈ లైట్లను చెట్ల చుట్టూ, కిటికీల చుట్టూ, మెట్ల గోడలపై వేయండి. ఇలా చేయడం వల్ల గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకమైన రంగు, ఆనందాన్ని తెస్తుంది.
భారతీయ కళలు, శిల్పాలు
భారతీయ కళలతో ఇంటిని అలంకరించడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. తిలకం, హస్తకళలు, చేతితో రూపొందించిన సంప్రదాయ వస్త్రాలతో ఇంటిని సుందరంగా తీర్చిదిద్దవచ్చు. ఇవి మీ ఇంటికి భారతీయతను నింపి, ఆ వాతావరణాన్ని మరింత శ్రద్ధతో ప్రత్యేకంగా మలుస్తాయి. ఈ సింపుల్ గ్రాండ్ డెకరేషన్ ఐడియాలతో మీ గణతంత్ర దినోత్సవం వేడుకలు మరింత ప్రత్యేకంగా జరుపుకోండి.
