
Prakasam: వివరాల్లోకి వెళితే .. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి షేక్ రెహానా బేగం బయో మెడికల్ మాస్టర్స్ చదివేందుకు 2017లో జర్మనీకి వెళ్లింది. ఐదేళ్ల పాటు అక్కడే చదవుకున్న రెహానా 2023లో తిరిగి స్వగ్రామానికి వచ్చింది. తాజాగా మళ్లీ ఈ మధ్యే తిరిగి జర్మనీకి వెళ్లింది. ఆ తరువాత ఆమె అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో యువతికి అక్కడ 22 నెలల పాటు చికిత్స అందించారు. అయినా ఉపయోగం లేకుండా పోవడంతో ఈనెల 23వ తేదీన రెహాన బేగం మృతి చెందింది. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ల బంధువులే తెలియజేశారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని జర్మనీ నుంచి కంచిపల్లికు తరలించిన బంధువులు.. ఇటీవలే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్నత చదువల కోసం అని విదేశాలకు వెళ్లిన యువతి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Rehana New
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..