
కోలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్ స్లే తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. వరుణ్ డాక్టర్, బీస్ట్, ది వారియర్, జైలర్, మార్క్ ఆంటోని, మ్యాక్స్, కంగువా తదితర హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ స్టార్ నటుడు.
గతేడాది కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు రెడిన్ కింగ్ స్లే.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ స్టార్ కమెడియన్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు.
2023లో సీరియల్ నటి సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు రెడిన్ కింగ్ స్లే. అప్పటికే 45 ప్లస్ లో ఉన్న ఆయన ఒక బుల్లితెర నటిని ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కొందరు విమర్శలు కూడా గుప్పించారు
అయితే వీటిని ఏ మాత్రం లెక్క చేయకుండా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తోన్న ఈ లవ్లీ కపుల్ త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు.
తాజాగా సంగీత సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఆది పినిశెట్టి సతీమని నిక్కీ గల్రాణీ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.