Royal Challengers Bengaluru vs Gujarat Titans, 14th Match: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 14వ మ్యాచ్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ బెంగళూరు హోం గ్రౌండ్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. గత సీజన్లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. రెండింటిలోనూ బెంగళూరు గెలిచింది.
రెండు మ్యాచ్ల్లో రెండు విజయాలతో బెంగళూరు 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో, గుజరాత్ రెండు మ్యాచ్ల్లో ఒక విజయంతో 2 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది.
