
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరులో బ్యాటర్లలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ మినహా ఎవరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో ఆర్సీబీ ఢిల్లీకి భారీ టార్గెట్‌ను ఇవ్వలేకపోయింది. ఇక లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి స్టార్టింగ్‌లోనే ఆర్సీబీ బౌలర్స్ షాక్ ఇచ్చారు. ఓపెనర్స్‌గా వచ్చిన డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్‌ను డబుల్ డిజిట్ పరుగులు చేయకముందే వెనక్కి పంపారు. తొలుత డుప్లెసిస్ వికెట్‌ను యశ్ దయాళ్ తీయగా.. ఆ తర్వాత వచ్చిన భువనేశ్వర్ జేక్ ఫ్రేజర్ (7), అభిషేక్ పొరెల్ (7)ని వెనక్కి పంపాడు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ కూడా అంతగా రాణించలేక పోయాడు.
కేలవం 15 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. ఇక బెంగళూరు బౌలర్స్ దెబ్బకు ఢిల్లీ స్కోర్ డీలా పడిపోయింది. 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ ఆర్సీబీ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్స్‌లతో ఆర్సీబీ బౌలర్స్‌పై విరుచుకు పడ్డాడు. కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఢిల్లీ స్కోర్ బోర్డు అమాంతం పెరిగిపోయింది. రాహుల్ దూకుడుతో 17.5 ఓవర్లలోనే ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్‌ను ఢిల్లీ చేధించగలిగింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ ఒక్కో వికెట్ తీశారు.
🔥 KL Rahul owns Bengaluru! 😎• The Delhi Capitals star roared “I’m from BENGALURU” at Chinnaswamy Stadium 🏟️
• Smashed RCB in style, showing his roots run deep 💪
• Goyanka Ji watching 🤦—KL’s fiery performance stole the show! 🌟#KLRahul #DCvRCB #IPL2025 #RCBvsDC pic.twitter.com/nUBAaabyi3
— CRICKET 18 LOVER (@Cricket_18_love) April 11, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..