
రసమలై తినడం అందరికీ ఇష్టమే.. నోట్లో పెడితే కరిగిపోయే రసమలైని తినడం మొదలు పెడితే ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు. అంత రుచికరమైన రసమలై ని తినాలంటే రెస్టారెంట్ కి లేదా స్వీట్ షాప్ కి వెళ్ళాల్సిందే.. అని అనుకుంటారు. అయితే చిక్కటి పాలు ఉంటే చాలు ఇంట్లోనే రుచికరమైన రసమలైని చేసుకోవచ్చు. పెద్దలకు, పిల్లలకు నచ్చే రసమలై రెసిపీ మీ కోసం..
కావాల్సిన పదార్థాలు
పాలు – రెండు లీటర్లు చిక్కటి పాలు
పంచదార – ఒకటిన్నర కప్పు
ఇవి కూడా చదవండి
యాలకుల పొడి – అర టీస్పూను
కుంకుమ పువ్వు – కొంచెం
నిమ్మరసం- రెండు స్పూన్లు
బాదం పప్పులు -10
పిస్తాలు – 10
జీడిపప్పు – 10
తయారీ విధానం: స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టి పాలు వేసి మరిగించండి. పనీర్ కోసం పాలలో నిమ్మరసం వేయండి. ఇప్పుడు పాలు విరిగి.. పనీర్ అవుతుంది. అప్పుడు ఇలా విరిగిన పాలను ఒక క్లాత్ లో వేసి నీటిని వడకట్టాలి. ఇప్పుడు పన్నీర్ రెడీ అవుతుంది. ఇపుడు ఈ పనీర్ ని రసమలై ని స్వీట్ ఆకారంలో ఒత్తుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీరు, పంచదార వేసి లేత పాకం పట్టుకోవాలి. ఇపుడు ఆ పాకంలో రెడీ చేసుకున్న పనీర్ బాల్స్ వేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు రబ్డీని రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో పాలు వేసి మరిగించాలి. పాల మీద మీగడ రాగానే .. ఆ మీగడను ఒక ప్లేట్ లో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఐదు ఆరు సార్లు చేసి మీగడ తీసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగి రంగు మారతాయి. ఇప్పుడు పాలల్లో పంచదార, కుంకుమప్పు , యాలకుల పొడి వేసి మరికొంచెం సేపు మరిగించండి. అంతే రబ్డీ రెడీ అవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్లో పెట్టి మూడు గంటలు పెట్టాలి. ఇంతలో బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత రబ్డీ మిశ్రమాన్ని తీసుకుని పనీర్ బాల్స్ పై పోసుకోవాలి. తర్వత కట్ చేసి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ని వేసుకోవాలి. అంతే చల్ల చల్లని రసమలై రెడీ. వేసవిలో దీనిని అందించండి.. పిల్లలు పెద్దలు వావ్ అంటూ తినేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..