
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వయసు సుమారు 59 సంవత్సరాలు. కానీ ఆయన నటించిన ‘సికందర్’ సినిమాలో 28 ఏళ్ల రష్మిక మందన్నతో జతకట్టాడు . ఇద్దరి మధ్య సుమారు 31 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. గత కొన్ని రోజులుగా ఈ అంశాన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ లేదా రష్మిక మందన్న దీని గురించి పట్టించుకోవడంలేదు. అలాగే, చిత్ర పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు కూడా ఏజ్ గ్యాప్ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. తాజాగా దీనిపై ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందరితో పంచుకుంది. అదే సమయంలో, ‘సికందర్’ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ టాక్ గురించి మాట్లాడింది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న మధ్య వయసు అంతరం గురించి కూడా ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. అయితే దీనికి ఆమె చాలా సానుకూలంగా సమాధానమిచ్చింది.
ఈ సందర్భంగా అమీషా పటేల్ తను నటించిన ‘గదర్’ సినిమా ను ఉదాహరణగా తీసుకుంది. ‘ ఈ సినిమాలో నాకు, సన్నీ డియోల్ కు మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. మా జంట కు మంచి పేరొచ్చింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాల గురించి ప్రతికూలంగా మాట్లాడే వారి గురించి పట్టించు కోవద్దు. కొందరు జనాలు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అది వాళ్ళ పని. వాళ్ళ మాటలన్నీ అర్థరహితం’ అని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.\
ఇవి కూడా చదవండి
రష్మిక లేటెస్ట్ ఫొటోస్..
Me fully clearly showing you what all I wore that day for the Sikandar trailer launch.. just the way miss Meagan asked me to. 😎🐒
I know right now my team is grinning by themselves cz they are so happy the look came out well. 🐒🤣❤ pic.twitter.com/Loj6tm4skc— Rashmika Mandanna (@iamRashmika) March 25, 2025
అమీషా పటేల్ మరియు సన్నీ డియోల్ 2023 లో ‘గదర్ 2’లో కలిసి నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే సన్నీ- అమిషాల జోడీకి కూడా మంచి పేరొచ్చింది. అమీషా చాలా సంవత్సరాలుగా బాలీవుడ్లో ఉంటోంది. ఆమెకు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆమె తన గ్లామర్‌ను కాపాడుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు తరచుగా వైరల్ అవుతాయి.
అమీషా పటేల్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.