
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. యానిమల్, పుష్ప 2 హిట్స్ తర్వాత ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం రష్మిక తన జిమ్ లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయమైంది. దీంతో కొన్ని రోజులుగా ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. దీంతో ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాల చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇక ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయంలో రష్మిక వీల్ చైర్ లో కనిపించింది. ఇవాళ ముంబయిలో జరిగిన ఛావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైంది ఈ ముద్దుగుమ్మ. తన కాలు సహకరించకున్నప్పటికీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసింది.
ఈ వేడుకకు రష్మిక కుంటుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా హీరో విక్కీ కౌశల్ ఆమెను చేతపట్టుకుని స్టేజీపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మిక డెడికేషన్ చూసి ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీకౌశల్, రష్మిక ప్రధాన పాత్రలలో తెరకెక్కితున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
తాజాగా ఛావా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లక్షణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీల శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..