
తాజాగా రాజమండ్రి గోదావరి నదిలో అస్తికలు కలుపుతున్న వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఈ స్టార్ యాంకర్. ఇంతకీ రష్మీ కలిపిన అస్తికలు ఎవరివో తెలుసా.. తన పెంపుడు కుక్క చుట్కీవి. సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలను కుటుంబసబ్యులు, పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలను రాజమండ్రి దగ్గరున్న నదిలో కలిపింది.కొన్నాళ్లుగా తాను ఎంతగానో ప్రేమించిన తన పెంపుడు కుక్కకు కన్నీటి వీడ్కోలు పలికింది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు కుక్క చుట్కీ చనిపోయిందని చెబుతూ రష్మీ ఎమోషనల్ అయింది. తాజాగా చుట్కీ అస్థికలను తీసుకువచ్చి రాజమండ్రి నదిలో కలిపింది. జీవితాంతం మిస్ అవుతూనే ఉంటాను. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్లు చుట్కీ గౌతమ్’ అంటూ భావోద్వేగానికి గురైంది ఈమె. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఫ్యాన్స్‌ను కూడా ఎమోషనల్ అయ్యాలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్