
బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెతోపాటు యంగ్ హీరో తరుణ్ రాజ్ పేరు సైతం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తరుణ్ రాజ్ ను విచారించారు.ఈ క్రమంలోనే అతడు మరిన్ని విషయాలను బయటపెట్టినట్లు వెల్లడైంది. నటి రన్యరావు తాను కాలేజీ నుంచి స్నేహితులం అని.. 2023లో 50:50 భాగస్వామ్యంలో దుబాయ్‌లో వీర డైమండ్స్ ట్రేడింగ్ LLC అనే కంపెనీని ప్రారంభించామని తరుణ్ రాజ్ చెప్పినట్లు తెలుస్తోంది.
దుబాయ్‌కి బంగారాన్ని దిగుమతి చేసుకుని, ఆ బంగారాన్ని అమ్మాలనే ఉద్దేశ్యంతోనే ఆ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నామని.. దానికి రన్య మాత్రమే పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. దుబాయ్‌లోని డీలర్లకు విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిగాయని తరుణ్ రాజ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో బంగారం డెలివరీ చేయనందుకు ఒక డీలర్ ఒకసారి రూ. 1.7 కోట్లు పోగొట్టుకున్నాడని.. దీంతో రన్య రావు ఇండియా నుంచి దుబాయ్ కు హవాలా ద్వారా రూ .1.7 కోట్లు తీసుకువచ్చిందని.. ఆమెకు తన కుటుంబం ద్వారా జెనీవా, బ్యాంకాక్ లలో పరిచయాలు ఉన్నట్లు తెలిసింది. రన్యా రావు బంగారం కొని తరుణ్ రాజ్ పేరు మీద కస్టమ్స్ అధికారులకు చెబుతూ దానిని జెనీవాకు తీసుకెళ్తానని చెప్పిందని.. ఏప్రిల్ 2024 నుండి జెనీవా లేదా బ్యాంకాక్ నుండి బంగారం కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
న్యా తన HDFC బ్యాంక్ ద్వారా VIRA DIAMONDS అనే కంపెనీని స్థాపించడానికి రూ. 8-10 లక్షలు పెట్టుబడి పెట్టిందని తరుణ్ వెల్లడించాడు . బంగారం అక్రమ రవాణా కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నటి రన్యా రావును సీబీఐ తన కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లోని పిఎస్ఐ, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల వాంగ్మూలాలను సిబిఐ ఇప్పటికే నమోదు చేసింది.నటి రన్యా రావు ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..