
బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. రన్యా రావు స్నేహితుడు తరుణ్ రాజ్‌కు 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. తరుణ్ రాజ్‌ను జైలుకు తరలించారు DRI అధికారులు.
బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావు స్నేహితుడు తరుణ్ రాజ్‌కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజ్‌ను DRI అధికారులు లోతుగా విచారించారు. రన్యా రావుతో పాటు తరుణ్ రాజ్‌ను DRI అరెస్ట్ చేసింది. కస్టడీ ముగియడంతో తరుణ్‌రాజ్‌ను జైలుకు తరలించారు.కాగా బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు కోర్టులో చుక్కెదురయ్యింది. రన్యా రావు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. DRI అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు రన్యా రావు లాయర్. మానసికంగా హింసించి ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారని ఆరోపించారు. హక్కులను హరించారని కోర్టుకు తెలిపారు.
మార్చి 3వ తేదీ అనుకోకుండా తాను దుబాయ్‌కు వెళ్లినట్టు తెలిపారు రన్యా రావు.. గుర్తు తెలియని వ్యక్తి తనకు ఎయిర్‌పోర్ట్‌లో బంగారం ఇచ్చినట్టు తెలిపారు. రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆమె వెనుక ఒక మంత్రి ఉన్నారనే పుకార్లతో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావు స్నేహితుడు తరుణ్ రాజ్‌కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజ్‌ను DRI అధికారులు లోతుగా విచారించారు. రన్యా రావుతో పాటు తరుణ్ రాజ్‌ను DRI అరెస్ట్ చేసింది. కస్టడీ ముగియడంతో తరుణ్‌రాజ్‌ను జైలుకు తరలించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..