
నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ పర్వదినం కన్నుల పండువగా జరుగుతోంది. అన్ని మసీదుల్లో సామూహికంగా నమాజులు జరుగుతున్నాయి. ఢిల్లీ జామా మసీదు, హైదరాబాద్ మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు చేస్తున్నారు. రాత్రి నెలవంక దర్శనమిచ్చింది. మసీదులు, ముస్లింల గృహల్లో సందడి నెలకొంది. ముస్లింల ముఖాల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. ఆదివారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. సామూహిక ప్రార్థల దృష్ట్యా మున్సిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. షామియానాలు, టెంట్లు, కార్పెట్లు, సౌండ్ సిస్టంలు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రార్థనల సమయంలో పోలీసులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టనున్నారు.