
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చి బాబు దర్శకత్వంలో RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో.. స్పోర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అర్ధరాత్రి కూడా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజా షెడ్యుల్ లో చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొంటుంది. ఇప్పటికే శివ రాజ్ కుమార్ తన పాత్ర కోసం లుక్ టెస్ట్ ముగించుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యుల్ లో శివ రాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారని చిత్ర యూనిట్ టాక్.
RC16 మూవీలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడట. చరణ్ క్రికెట్ ప్లేయర్ గా, కుస్తీ ఆటగాడిగా ఇలా రకరకాల ఆటలు వచ్చిన యువకుడిగా కనిపించనున్నాడట. దీంతో రామ్ చరణ్ పాల్గొనే క్రికెట్ మ్యాచ్ కు సంబందించిన సన్నివేశాలను షూటింగ్ చేశారు. ఈ సమయంలో ఎవరో తమ సెల్ ఫోన్ కి పని చెప్పారు. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
#RC16 maa anna movie 💥💥💥 pic.twitter.com/Mc8TAtK4Et
— ANIL RCF GAME CHANGER 🏐🏀🌍 (@AnilRcf30605) March 12, 2025
ఈ వీడియోలో ఒక మైదానంలో రామ్ చరణ్ క్రికెట్ అడుతున్నట్లు కనిపిస్తోంది. తమ అభిమాన హీరోని క్రికెటర్ గా చూసిన అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. షేర్ చేయడమే కాదు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అబిమానని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీలో జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని త్వర త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలి చిత్ర నిర్మాతలు భావించినట్లు.. అనుకోని కారణాల వలన సినిమా రిలీజ్ కొత్త ఏడాది 2026లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..