
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాల మధ్యలో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యలో నటించాడు చరణ్.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. చరణ్ చేస్తున్న నెక్స్ట్ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు.
ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ మెన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. చరణ్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే చరణ్ సినిమాలో ప్రముఖ క్రికెటర్ ధోని నటిస్తున్నాడని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే నిజంగా ధోని చరణ్ సినిమాలో నటిస్తున్నారా లేదా అన్నదని పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ సినిమాలో ధోని నటిస్తున్నాడా లేదా అనే విషయం పై ఆర్సీ 16 టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి ధోని, చరణ్ కు మధ్య ఎప్పటి నుంచో ఫ్రెండ్ షిప్ ఉంది. ఇద్దరు చాలా సందర్భాల్లో కలిశారు. అయితే ఇప్పుడు చరణ్ సినిమాలో ధోని నటిస్తున్నాడన్నదానిలో నిజం లేదు అని తెలుస్తుంది. బుచ్చిబాబు సినిమాలో ధోని నటించడం లేదని, కథలో కూడా ధోని కోసం పాత్ర రాయలేదని తెలుస్తుంది. ఇక ధోని నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళ్ లో సినిమా నిర్మించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..