
ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత చరణ్ ఆర్సీ 16 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోపై ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రేపు (మార్చి 27న) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి కచ్చితంగ అప్డేట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఆర్సీ 16 మేకర్స్.
చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మార్చి 27న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఆర్సీ 16 టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా మరో స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ లో చరణ్ ఫుల్ జుట్టు, గడ్డంతో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా క్రికెట్, రెజ్లింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివన్న కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Fearless in battle. Relentless in spirit.
TOMORROW. 9.09 AM.#RC16 pic.twitter.com/tYb4t3SdxA
— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..