
R. Narayana Murthy, Cm Reva
ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి. నటుడు ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నారాయణ మూర్తి. ఇటీవల ఆయన సినిమాలు తగ్గించారు ఒకప్పుడు ఆయన ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. రీసెంట్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నారాయణ మూర్తిని కలిశారు. ఆయన తెరకెక్కించనున్న ప్యారడైజ్ సినిమాలో కీలక పాత్రలో నారాయణ మూర్తి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.