
ప్రస్తుతం పూరిజగన్నాథ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.
పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు.అయితే పూరి నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేస్తారు అన్నది మాత్రం సాస్పెన్స్ గానే ఉంది. ఆ మధ్య అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో పూరి సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. అలాగే తమిళ్ హీరో సినిమా చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూరికి హీరో దొరికాడని తెలుస్తుంది.
పూరిజగన్నాథ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజా సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అలాగే విడుదల 2లోనూ నటించి మెప్పించారు. ఇప్పుడు పూరి డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే విజయ్‌కి పూరి కథ వినిపించినట్టు తెలుస్తోంది. కథాచర్చలు కొలిక్కి వచ్చినట్టే అని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడంపై క్లారిటీ రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Cupid has struck
#UrugudhuUrugudhu – The Perfect Melody for the Perfect Pair is Out Now. Enjoy the ‘Melting Love Vibes’
https://t.co/eIyIyvqULX
@shreyaghosal & @KapilKapilan_
@kavithamarai #AceFirstSingle@rukminitweets @7CsPvtPte @Aaru_Dir… pic.twitter.com/SQtsgfGVX9
— VijaySethupathi (@VijaySethuOffl) March 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి