
గుమ్మడికాయ పోషకగుణాలు ఎక్కువగా కలిగిన కాయలలో ఒకటి. దీని నుంచి తీసే రసం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ జ్యూస్లో విటమిన్ A, C ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని రోగనిరోధకంగా మారుస్తుంది. తరచుగా జలుబు, దగ్గు సమస్యలు రాకుండా కాపాడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో మంచిది. కడుపు మంట, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. లివర్, కిడ్నీలను శుభ్రం చేసే గుణాలు ఇందులో ఉంటాయి. గుమ్మడికాయ రసం చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ముడతలు, మచ్చలు రాకుండా చేస్తుంది.చర్మాన్ని హైడ్రేట్ చేసి తేమను ఇస్తుంది. గుమ్మడికాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుమ్మడి కాయ జ్యూస్ తయారీ కోసం ముందుగా గుమ్మడికాయ ముక్కలను చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. అర గ్లాసు నీరు కలిపి బాగా మిక్స్ చేయాలి. అవసరమైతే తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. గుమ్మడికాయ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. ఉదయాన్నే తాగితే శరీరం శుద్ధి అవుతుంది. బరువు తగ్గించుకోవాలనుకునే వారు దీన్ని తప్పకుండా ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..