
పూజిత పొన్నాడ ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేసే భారతీయ నటి. ఆమె ప్రధానంగా 2018లో రంగస్థలం మరియు 2019లో కల్కి చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ది చెందింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
05 అక్టోబర్ 1989న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెస్టినీ సిటీ విశాఖపట్నంలో జన్మించింది వయ్యారి భామ పూజిత పొన్నాడ. తమిళనాడులోని చెన్నైలోని SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి B.Tech సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టా పొందింది.
పూజిత పొన్నాడ షార్ట్ ఫిల్మ్‌లతో నటన ప్రారంభించే ముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. 2016లో నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ చిత్రం ఊపిరిలో గేలరీ మేనేజర్ గా సినీరంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ.
2018లో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రంలో పద్మ అనే పాత్రలో ఆకట్టుకుంది అందాల తార పూజిత. తర్వాత రాజు గాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7, కల్కి, రన్, మిస్ ఇండియా, మనీషే,కథ కంచికి మనం ఇంటికి వంటి చిత్రాల్లో నటించింది.
2022లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది ఈ వయ్యారి భామ. 2023లో రావణాసుర, జోరుగా హుషారుగా చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తుంది.