
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా క్రికెట్ కెరీర్ కష్టాల్లో పడింది. గత కొన్ని రోజులుగా ఫామ్ లేకపోవడంతో అతనిని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఫిట్నెస్ కారణాలతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అతడిని రంజీ జట్టు నుంచి తప్పించింది. IPL 2025 టోర్నమెంట్‌కు ముందు మెగా వేలంలో అతన్ని తీసుకోవడానికి ఏ జట్టు ఆసక్తి చూపలేదు. కాబట్టి పృథ్వీ షా రాబోయే రోజల్లో కౌంటీ ఛాంపియన్షిప్ లో ఆడడం మంచదని క్రికెట్ నిపుణులు సచిస్తున్నారు. 2024లో ఈ టోర్నీలో ఆడిన పృథ్వీ మంచి ప్రదర్శన చేశారు. రంజీ ట్రోఫీ తదుపరి సీజన్ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది. పృథ్వీ షా తప్పుకోవడంతో ఈ టోర్నీలో ఆడడం కష్టమే. ఆ తర్వాత మరో రెండు నెలలు ఐపీఎల్ టోర్నీ జరగనుంది. కాబట్టి రాబోయే కొద్ది నెలలు పృథ్వీ మైదానంలో దిగే అవకాశాల్లేవు. అయితే అతను తన క్రికెట్ కెరీర్ ను కాపాడుకోవడానికి ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడాలి.
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1, 2 మ్యాచ్‌లు ఏప్రిల్ 2025లో ప్రారంభమవుతాయి. షా కౌంటీ క్రికెట్లో ఆడాలని పృథ్వీ నిర్ణయించుకుంటాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పృథ్వీ గతంలో షా కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడాడు. పృథ్వీ షా 2023లో కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. అతను రెండు సీజన్లలో బాగా ఆడాడు. ఇప్పుడు మరోసారి అతను మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే ఫిట్నెస్ పరంగా బాగా మెరుగవ్వాల్సి ఉంది. అలాగే క్రికెట్లో మంచి ప్రదర్శన చేయాలి.
ఇవి కూడా చదవండి
పృథ్వీ షా 5 టెస్టులు, 6 వన్డేలు, 1 టీ20 ఇంటర్నేషనల్ ఆడాడు. 5 టెస్టు మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీతో 339 పరుగులు చేశాడు. అతను రెండు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. వన్డే క్రికెట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆరు వన్డేల్లో మొత్తం 189 పరుగులు చేశాడు. ఏకైక టీ20 మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. అందులోనూ ఖాతా తెరవలేకపోయాడు. దీంతో క్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ క్రికెటర్.
మైదానంలో చెమటోడ్చుతోన్న క్రికెటర్ పృథ్వీషా..
Prithvi Shah has started working hard on his fitness again to silence his critics…!👏
Best of luck bro 👍 pic.twitter.com/x9jCiEDGoz
— Gurlabh Singh (@Gurlabh91001251) January 9, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..