
నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్లను ఎక్కువగా తింటారు. వీటిని తిని తిని బోర్ కొట్టింది అనుకున్న సమయంలో సీఫుడ్ ఎంచుకుంటారు. రొయ్యలను ఎక్కువ మంది తింటారు. అయితే వీటిని రెగ్యులర్ గా కాకుండా తక్కువ వస్తువులతో టేస్టీ టేస్టీగా రొయ్యల వేపుడిని తయారు చేసుకోండి. ఈ రోజు రొయ్యల ఫ్రై ని సింపుల్ గా తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..
రొయ్యల వేపుడికి కావలసిన పదార్ధాలు
- రొయ్యలు: పెద్దవి అర కిలో
- అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్
- మైదా పిండి – అర కప్పు
- కార్న్ ప్లోర్ – కొంచెం
- గుడ్లు – రెండు
- పసుపు- చిటికెడు
- కారం – మూడు స్పూన్లు
- ఉప్పు- రుచికి సరిపడా
- బ్రెడ్ స్లైస్ -నాలుగు
- నిమ్మ రసం – రెండు స్పూన్లు
- నూనె: వేయించడానికి సరిపడా
ఇవి కూడా చదవండి
తయారీ విధానం: ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో రొయ్యలను వేసుకుని చిటికెడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మైదా, కార్న్ ప్లోర్ మిశ్రమంలో ఈ రొయ్యలను వేసి కలపాలి. ఒక గిన్నెలో గుడ్లు సోనలు వేసుకుని గిల కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలను గుడ్డు సోనలో వేసి వాటిని తీసుకోవాలి. తర్వాత ఈ రొయ్యలను బ్రెడ్ పొడిలో వేసి ముంచుకోవాలి. ఇంతలో పాన్ లో నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత రొయ్యలను వేసి వేయించాలి. గోధుమ రంగు వచ్చేటంత వరకూ వేయించుకుని ఒక ప్లేట్ లోకి రొయ్యలను తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని కెచప్ తో అందించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.