
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పెట్టుబడి పథకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అధిక ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం పీపీఎఫ్ సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.
పీపీఎఫ్ పథకంలో మీరు సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ పెట్టుబడిపై ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు.
అలాగే ఈ ఖాతా 15 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. పీపీఎఫ్ పథకం మెచ్యూర్ అయ్యాక కూడా 5–5 సంవత్సరాల కింద పొడిగించవచ్చు.
ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 27,12,139 లభిస్తుంది
ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే ఏకంగా వడ్డీనే రూ.12,12,139 వస్తుంది.