
పోసాని కృష్ణమురళి పోలీస్ శాఖను, జైళ్ల శాఖను హడలెత్తించారు. ఛాతిలో నొప్పి అని చెప్పడంతో అధికారులు ఆగమేఘాల మీద రాజం పేట ఆస్పత్రికి అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షలు చేయించారు. కట్ చేస్తే అదంతా డ్రామా అని ప్రకటించారు రైల్వేకోడూరు పోలీసులు. నొప్పి రాజా ఛాతిలో విపరీతమైన నొప్పి అని జైలు అధికారులకు చెప్పారు పోసాని కృష్ణమురళి. దీంతో రాజంపేట సబ్ జైలు అధికారులు టెన్షన్ పడ్డారు. హుటాహుటిన రాజంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం అందించాలంటూ కడప రిమ్స్‌కు తరలించారు.
కడప రిమ్స్‌లో పోసానికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని తెలిపారు. గతంలో పోసానికి హార్ట్ సర్జరీ జరిగిందని అందుకే అన్ని పరీక్షలు నిర్వహించామన్నారు డాక్టర్లు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసాని ఉదయం నుంచి నాటకం ఆడారన్నారు రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నారన్నారు. మరోవైపు పోసానిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయన్నారు హోంమంత్రి అనిత. తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదన్నారు.
పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు పోసానికి బెయిల్ ఇస్తుందా లేక పోలీస్ కస్టడీకి ఇస్తుందా చూడాలి మరి. అనుభవించు రాజా.. చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే రాజా అంటూ పోసానిపై సెటైర్లు వేస్తున్నారు టీడీపీ నేతలు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారామె.
ఇవి కూడా చదవండి
అంతుకుముందు.. ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. వైసీపీ నేతలపై కక్షగట్టి జైలుకు పంపుతున్నారన్నారు. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. నిజంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే చాలామంది వైసీపీ నేతలు జైల్లో ఉండేవారన్నారామె. చట్టం ఎవరి చుట్టం కాదన్నారు. పోసాని మాట్లాడిన మాటలకు రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయన్నారు . మరోవైపు పోసాని మురళి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తారా లేదా కస్టడీకి ఇస్తారా చూడాలి మరి.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..