
ఈ పాట వినగానే అఖిల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, పూజా ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో యూత్‌కి అంత బాగా దగ్గరైంది మరి.
అందుకే, భాస్కర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా జాక్లోనూ ముందు పూజా హెగ్డేనే అనుకున్నారనే టాక్ ఆ మధ్య బాగా స్ప్రెడ్ అయింది. జాక్ కోసం పూజా హెగ్డేని కన్సిడర్ చేయలేదని… తాము ముందు నుంచీ వైష్ణవినే అనుకున్నామని క్లారిటీ ఇచ్చేశారు హీరో సిద్ధు జొన్నలగడ్డ.
ఈ క్లారిటీతో టాప్‌లో ట్రెండ్ అయింది పూజా హెగ్డే పేరు. దానికి తోడు ఆమె ఈ మధ్య తిరుపతి విజిట్ చేసి మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సమ్మర్ కానుకగా మే 1న విడుదల కానుంది రెట్రో.
ఈ సినిమాను జస్ట్ కోలీవుడ్ సినిమాగా చూడటం లేదు పూజా హెగ్డే. తెలుగులోనూ రెట్రో కచ్చితంగా క్లిక్ అవుతుందన్నది పూజా నమ్మకం. సూర్య నటించిన ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లోనూ మంచి హోప్స్ ఉన్నాయి.
మరోవైపు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే. విజయ్ నటిస్తున్న జననాయగన్లో నాయికగా నటిస్తున్నారు పూజా. వీరిద్దరి కాంబినేషన్లో ఇది సెకండ్ మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. సో, చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక పూజా తెలుగులో సైన్ చేస్తారా? లేకుంటే అదర్ లాంగ్వేజెస్‌లోనే ఉంటూ, తెలుగుకు దూరం దూరంగా తిరుగుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ…