
హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.. కానీ తమిళ్, హిందీ సినిమాల్లో మాత్రం బిజీగా ఉంది.
ఇటీవలే ఓ హిందీ సినిమాలోనూ నటించింది షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమా మొన్నీమధ్య విడుదలైంది. కానీ ఆ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతమ్స్ సూర్య సరసన రెట్రో సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో పూజా హెగ్డే తెలుగులోనూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మా ఫ్యామిలీ నుంచి ప్రజర్ ఉంది. నేను కర్ణాటక నుంచి వచ్చాను, నేను తుళు అమ్మాయిని.. కాబట్టి కన్నడ భాషలో సినిమాలు చేయాలనీ నా పేరెంట్స్ అడుగుతున్నారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. కన్నడ సినిమా కథలను కూడా కొన్ని విన్నాను. కానీ అవి అంతగా కనెక్ట్ అవ్వలేదు. మంచి కథ దొరికితే తప్పకుండ కన్నడ భాషలో నటిస్తా.. నా పేరెంట్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.