
PM Mudra Loan: ప్రధాన మంత్రి ముద్రా యోజన సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కేంద్రం తీసుకువచ్చిన అద్భుతమైన పథకం ఇది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు లోన్ ఇచ్చే ముద్రా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు, చిన్న కార్మికులు, రైతులు, శారీరక శ్రమ చేసేవాళ్ళు అందరూ పారిశ్రామికవేత్తలుగా మారాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8న ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రారంభమై 10 ఏళ్ల పూర్తవుతోంది.
అయితే ఈ పీఎం ముద్రా యోజన పథకం మొదలైన పదేళ్లలో మొత్తం రూ.32.61 లక్షల కోట్ల విలువైన 52 కోట్ల కంటే ఎక్కువ రుణాలు అందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పీఎం ముద్ర యోజన స్కీమ్ కింద రూ.10 లక్షల వరకు పూచికత్తు లేని రుణాలను ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు అందిస్తున్నాయి. ఈ బ్యాంకులే కాకుండా గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా ముద్రా లోన్లు ఇస్తున్నాయి.
ఈ స్కీమ్ కింద ఎంత రుణం అందుతుంది?
- ఈ పథకం కింద రుణం పొందేవారు మూడు రకాలుగా ఉంటాయి. శిశు, కిషోర్, తరుణ్ అనే 3 రకాలుగా రుణాలు అందిస్తుంది కేంద్రం. అయితే
శిశు కేటగిరీలో రూ.50,000 వరకు - కిషోర్ కేటగిరీలో రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు
- తరుణ్ కేటగిరీలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తారు.
దీంతో పాటు తరుణ్ ప్లస్ అనే మరో కేటగిరీ కూడా ఉంది. ఇంతకు ముందు తీసుకున్న లోన్లను సరైన సమయంలో చెల్లిస్తే తరుణ్ ప్లస్ కేటగిరీలో రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు.
ముద్రా లోన్ కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ రుణం పొందాలంటే మహిళలతో పాటు ఎవరైనా వ్యక్తిగతంగా, ఏదైనా సంస్థ, ప్రైవేటు కంపెనీ ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణాలు పొందాలంటే 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణాలకు ఎలాంటి సెక్యూరిటీ లేదా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, అప్లికేషన్ ఫార్మ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి