
కేంద్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌కు ఆమోదం తెలపడానికి ముందు కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ కీలకవ్యాఖ్యలు చేశారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు, యువకుల ఆశల బడ్జెట్ అంటూ పేర్కొన్నారు. ఇది పేదలు, మధ్యతరగతి, రైతుల బడ్జెట్ అని.. అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయంటూ మోదీ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ బడ్జెట్ ఎలా ఉంటుందో మోదీ మరోసారి బిగ్ హింట్ ఇచ్చారు.