
2019లో కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసే పీఎం-కిసాన్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. అయితే రైతులకు సాయం చేసే ఉద్దేశంతో లాంచ్ చేసిన ఈ పథకంలో చాలా మంది అనర్హులు కూడా లబ్ధిపొందారు. అయితే పీఎం-కిసాన్ కింద అనర్హులైన రైతుల నుంచి ప్రభుత్వం రూ.416 కోట్లు వసూలు చేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పార్లమెంట్లో తెలిపారు. ఈ పథకం ప్రారంభం నుంచి కేంద్ర ప్రభుత్వం 19 విడతల్లో రైతులకు రూ.3.68 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసిందని స్పష్టం చేశారు.
పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం మూడు సమాన వాయిదాలలో అర్హత కలిగిన భూస్వాముల రైతుల ఆధార్-సీడెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పీఎం- కిసాన్ పథకం ప్రారంభంలో ట్రస్ట్ ఆధారిత వ్యవస్థపై ప్రారంభమైందని, రాష్ట్రాలు స్వీయ-ధృవీకరణ ప్రాతిపదికన లబ్ధిదారులను నమోదు చేసుకున్నాయని చౌహాన్ తన లిఖితపూర్వకంగా తెలిపారు.
పీఎం-కిసాన్ పథకం ప్రారంభంలో , కొన్ని రాష్ట్రాలకు ఆధార్ సీడింగ్‌ను కూడా సడలించారని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు విడుదలయ్యేలా చూసుకోవడానికి, భూమి సీడింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపు. ఈ-కేవైసీ తప్పనిసరి చేశామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..