రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత రాత్రి బాగా నిద్రపోకపోతే ఆ ప్రభావం మరుసటి రోజు పనిపై పడుతుంది. ఏ పని సవ్వంగా చేయలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాకుండా రోజంతా నిద్ర వస్తున్నట్లు మత్తుగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్నిసార్లు బెడ్‌పై ఉండే దుప్పట్లు, దిండు కూడా నిద్ర పాలిట విలన్లుగా మారుతాయి. అందువల్ల నిద్రకు ప్రాథమికంగా సరైన దిండు, సరైన మంచం ఉండాలి.
