
సాధారణంగా, మన వ్యక్తిత్తం, స్వభావం, భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి మనం జ్యోతిష్యంపై ఆధారపడతాము. ఇది మాత్రమే కాదు, సాముద్రిక శాస్త్రంలో, మన శరీర ఆకారం, కంటి ఆకారం, ముక్కు ఆకారం, పాదాల ఆకారం, అరచేతి రేఖ వంటి వాటి ద్వారా కూడా మన రహస్య వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవచ్చు. అదేవిధంగా, బొటనవేలు ఆకారం ద్వారా ఒక వ్యక్తి ఎలాంటి వాడో చెప్పవచ్చు. ఎలాగంటే మీ బొటనవేలు నిటారుగా ఉందా లేదా వంపుతిరిగి ఉందా అనే దాని ఆధారంగా మీ వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు.
మీ బొటనవేలు ఆకారం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించుకోండి
బొటనవేలు నిటారుగా ఉంటే: మీ బొటనవేలు నిటారుగా ఉంటే, మీరు తార్కిక, ఆచరణాత్మక వ్యక్తి అని అర్థం. అంటే ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు భావోద్వేగాల కంటే వాస్తవాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని అర్థం. అంతేకాకుండా, మీరు మొండి పట్టుదలగల వ్యక్తులు. మిమ్మల్ని ఎవరూ సులభంగా ఒప్పించలేరు. ఏవిషయంలోపైనా మీరు చాలా కఠినంగా ఉంటారు. అంటే మీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోంచికాగ గానీ నిర్ణయాలు తీసుకోరని అర్థం.
వెనుకకు వంగిన బొటనవేలు: ఒక వేళ మీ బొటనవేలు వెనకకు వంగి ఉంటే మీరు భావోద్వేగమైన వ్యక్తి అని అర్థం. అంటే ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తార్కికంగా ఆలోచడానికి బదులు ఎమోహషనల్ ఫీలింగ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొన్ని సందర్బాల్లో వాస్తవాల కన్నా ఏమోషనల్ నిర్ణయాలే ఉత్తమంగా ఉంటాయి. అలానే మీరు బంధుత్వాలకు, వ్యక్తిగ సంబంధాలు, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు అందరితో ఈజీగా కలిసిపోతారు. అలాగే మీకు ఇష్టమైన వారిని సంతోషంగా ఉంచడానికి మీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. మీలో సృజనాత్మక, కళాత్మక లక్షణాలు కూడా ఉంటాయి. మొత్తంమీద, మీ వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
